![పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10nrpt601-210166_mr-1739221390-0.jpg.webp?itok=jOjhPo4N)
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలంటూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా యూనియాన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేష్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడు నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయడంతోపాటు కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెంకటమ్మ, లక్ష్మీ, సత్యమ్మ, దేవమ్మ, పాపమ్మ, తిప్పమ్మ, అనంతమ్మ, చంద్రమ్మ, అంజమ్మ, లక్ష్మమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment