![సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10nrpt202-210084_mr-1739221390-0.jpg.webp?itok=brMB_4zF)
సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలి
నారాయణపేట రూరల్: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి సైన్స్‌పై ఇష్టాన్ని పెంచుకోవాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం ఫోరమ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి టాలెంట్ టెస్టుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు కొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో సైన్స్‌లో రాణించాలన్నారు. అంతకుముందు ఆన్‌లైన్ లో నిర్వహించిన పోటీలో తానియ ఫాతిమా (కోస్గి) ప్రథమ బహుమతి సాధించగా, నిహారిక (కోస్గి) ద్వితీయ బహుమతి, త్రిష, మేఘ వాణీ (మద్దూర్) తృతీయ బహుమతులు గెలుపొందారు. వారికి ప్రశంసా పత్రాలు, మెమొంటో లను అందించి అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, జిహెచ్‌ఎం సత్యనారాయణ సింగ్, సైన్స్ ఫోరం సభ్యులు మహేష్, శ్రీనివాస్ రెడ్డి, సక్సేన, అమృత్ తో, కనకప్ప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment