![అడుగడుగున జననీరాజనం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10mkl703-210167_mr-1739221389-0.jpg.webp?itok=6xgvONd5)
అడుగడుగున జననీరాజనం
● భూపోరాట మహిళ జ్యోతి కూతురికి కేటీఆర్ నామకరణం
కోస్గి రూరల్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోస్గి పర్యటనలో అడుగడుగునా జననీరాజనం పలికారు. నియోజకవర్గం మెట్లకుంట వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తుంకిమెట్ల గ్రామంలోని చౌరస్తా వద్ద మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డితో కలిసి పార్టీ జెండావిష్కరణ చేశారు. అక్కడి నుంచి హకీంపేటకు చేరుకున్న కేటీఆర్‌కు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఇదిలాఉండగా, గ్రామంలో భూమి కోల్పోతున్న సందర్భంగా నిండుగర్భిణిగా ఉన్న జ్యోతి ఢిల్లీ వరకు వెళ్లి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె గురించి ఆరా తీస్తూ.. జ్యోతి ఇంటికి వెళ్లి పలకరించాడు. తన కూతురికి మీరే పేరు పెట్టాలని జ్యోతి కోరగా.. పాత్లావత్ భూమినాయక్ అని నామకరణం చేశారు. అటు నుంచి కోస్గి పట్టణానికి చేరుకోగా.. పార్టీ శ్రేణులు భారీ ఊరేగింపు మధ్య గులాభీల పూలవర్షం కురిస్తూ ర్యాలీగా నీరసన దీక్ష సభకు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment