సాక్షి, ఢిల్లీ: పెట్రోల్, వంట గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వంట గ్యాస్ ధర ఎందుకు పెరుగుతుందో ప్రధాని చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. జీడీపీ పెరగడమంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమేనా అని ప్రశ్నించారు.
కాగా సామాన్యులపై మరోసారి గ్యాస్ బండ పిడుగు పడింది. రెండు నెలల వ్యవధిలోపే మూడుసార్లు సిలిండర్ ధరలు పెరిగాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్ ఇంధనాల ధరల మోతతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై ఎల్పీజీ మరోసారి గుదిబండగా మారింది. బుధవారం కేంద్ర ప్రభుత్వం మళ్లీ సిలిండర్ ధరను రూ. 25కు పెంచిన సంగతి తెలిసిందే.
చదవండి: నారద స్టింగ్ కేసు: ఈడీ ఛార్జ్‌షీట్‌లో నలుగురు నేతల పేర్లు
Comments
Please login to add a commentAdd a comment