ఆర్వోఆర్‌పై అవగాహన అవసరం
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● నూతన చట్టంపై వర్క్‌షాప్
నిర్మల్‌చైన్‌గేట్: నూతన ఆర్వోఆర్ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నూతన ఆర్వోఆర్ చట్టంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆమె మాట్లాడారు. రెవెన్యూ అధికారులు, రిటైర్డ్ అధికారులు, న్యాయ నిపుణులతో ఆర్వోఆర్ బిల్లుపై విస్తృతంగా చర్చించారు. ఆర్వోఆర్ బిల్లుపై అధికారులు, న్యాయనిపుణుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొత్త ఆర్వోఆర్ చట్టం కాపీని ఇదివరకే సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌లో పబ్లిక్ డొమైన్‌లో ఉంచారని తెలిపారు. తద్వారా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడానికి అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఆర్వోఆర్ బిల్లుపై ప్రజల సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని ఆదేశించారు. బిల్లులో గల అంశాలను ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్ర స్థాయిలోనూ ప్రజల నుంచి ఆర్వోఆర్ బిల్లుపై సలహాలు, సూచనలు స్వీకరించాలని తెలిపారు. అధికారులు తమ రోజువారీ విధుల్లో భాగంగా ఇంతకుముందున్న 2020 చట్టంలో ప్రజల నుంచి ఎన్నో ఫిర్యాదులు స్వీకరించారని, ఈ క్రమంలో ఎదురైన అనుభవాల ద్వారా కొత్త ఆర్వోఆర్ బిల్లులో గల అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆర్వోఆర్ చట్టం బిల్లుకు సంబంధించి వివరణలు, నిర్వచనాలు ఇతర అంశాలను అధికారులతో చర్చి ంచారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డీఆర్వో భుజంగ్‌రావు, నిర్మల్, ముధోల్ ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు, న్యాయ నిపుణులు, రిటైర్డ్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment