పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
నిర్మల్‌ఖిల్లా: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని నీటిపారుదల శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో సీపీఎస్‌ను నిరసిస్తూ బ్లాక్ డే పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి పాత పెన్షన్ విధానాన్ని అమలు లోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు చక్కెర శ్రీనివాస్, శరత్, సంతోష్‌సింగ్, సాయికృష్ణ, పడిగల రమణ, శ్రీనివాస్‌రెడ్డి, భూమన్న, లింగేశ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వినతిపత్రం అందజేత
సీపీఎస్‌ను తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ కలెక్టరేట్‌లో పరిపాలనాధికారి సూర్యారావుకు సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎస్ జిల్లా నాయకుడు కృష్ణారావు మాట్లాడారు. సీపీఎస్ ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపో యారు. కుటుంబాలకు భరోసా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment