● బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్
సారంగపూర్: రైతుల కష్టం తెలిసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల అభ్యున్నతే ధ్యేయంగా పాల న సాగిస్తున్నారని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కేదారీనాథ్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం స్థానిక రైతువేదిక భవనంలో 33 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతుల రుణాలు మాఫీ చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు కొంతమంది రైతుల రుణాలు మాత్రమే మాఫీ చేసిందని తెలిపారు. కనీసం రైతు భరోసా డబ్బులు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. రైతు కష్టం తెలిసిన నేత ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులకు పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేశారన్నారు. రైతులకోసం సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు చేపడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో రైతు ల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు.
రోడ్డు నిర్మాణానికి భూమిపూజ....
మండలంలోని కౌట్ల(బి) శాంతినగర్ నుంచి అడెల్లి తండా వరకు రూ.2.40 కోట్లతో ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో నిర్మించే బీటీరోడ్డు పనులకు ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి శుక్రవారం భూమిపూజ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గిరిజన గ్రామాలకు పక్కారోడ్లు ఉండాలన్న లక్ష్యంతో ప్రతీ తండాను అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి సొంతింటికల సాకారం చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అబ్దుల్‌హాదీ, బీజేపీ మండల అధ్యక్షుడు విలాస్, నాయకులు గంగారెడ్డి, చంద్రప్రకాశ్‌గౌడ్, రాంశంకర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్, సామల వీరయ్య, రాంరెడ్డి, చెన్ను రాజేశ్వర్, భూమారెడ్డి, తిరుమలచారి, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంతరావు, ఏఎంసీ కార్యదర్శి ధూమ్డానాయక్, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment