విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి
● వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి
లోకేశ్వరం: ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సూచించారు. మండలంలోని రాజూర, మన్మద్, హవర్గ కిష్టాపూర్, లోకేశ్వరం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆర్జేడీ వరంగల్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఎన్ఎస్ఎస్ పరీక్షలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతోపాటు విద్యను అందించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడేలా చూడాలన్నారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు జెడ్ల రాజేశ్వర్, సురేశ్, ముత్తన్న, జయసుందర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment