నిర్మల్
ఆదివారం శ్రీ 10 శ్రీ నవంబర్ శ్రీ 2024
నిర్మల్: ‘మాది నిర్మల్.. ’ అని ఎక్కడ పరిచయం చేసుకున్నా.. ‘ఓహో.. మీ దగ్గరే కదా కొయ్యబొమ్మలు తయారు చేస్తారు. చాలా బాగుంటాయి..’ అని చెబుతుంటే నిర్మల్‌వాసిగా, కొయ్యబొమ్మలకు వారసుడిగా గర్వంగా ఫీలవుతాం. నిమ్మల ఒడిలో పురుడుపోసుకుంటున్న కొయ్యబొమ్మ విదేశాల వరకు మన కళానైపుణ్యాన్ని తీసుకెళ్తోంది. ‘వాహ్.. నిర్మల్ బొమ్మ సూపర్..’అని మన ఊరికీ పేరు తెస్తూనే ఉంది. కొయ్యబొమ్మ కేవలం ఓ కళాకృతి మాత్రమే కాదు. మన నిర్మల్‌కు బ్రాండ్ అంబాసిడర్. ఏళ్లుగా అరలో ఒదిగిన ఆ కొయ్యబొమ్మ ఇప్పుడు దీనంగా చూస్తోంది. ఆదరించే వారు కరువవుతున్నారు. దీంతో చేసేవారూ తగ్గిపోతున్నారు. బొమ్మలకు ప్రాణంపోసే నకాశీ కుటుంబాలు ఉపాధి కోసం ఇతర మార్గాలు వెతుక్కుంటున్నాయి. ఇలాంటి తరుణంలో మన బొమ్మకు మనమే అండగా నిలువాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలామంది ఈ దిశగా.. తమవంతు ప్రయత్నం మొదలుపెట్టారు.
పెండింగ్ బిల్లులు
చెల్లించాలని మంత్రికి వినతి
ముధోల్: సర్పంచుల పెండింగ్ బిల్లులను డిసెంబర్‌లోపు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర మాజీ సర్పంచుల తరఫున జేఏసీ సహాయ కార్యదర్శి వెంకటాపూర్ రాజేందర్ బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌కు శనివారం వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాద్‌లోని మినిష్టర్ క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిశారు. మాజీ సర్పంచులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను మంత్రికి వివరించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. సర్పంచుల సంఘం ప్రతినిధులను చర్చలకు పిలిచి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారన రాజేందర్ తెలిపారు.
మన ఊరు.. మన బొమ్మ..
నిమ్మలంటే.. నిన్నమొన్నటిది కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఊరు ఏర్పడినప్పటి నుంచే ఇక్కడ కళలకు ప్రోత్సాహం ప్రారంభమైంది. నిమ్మనాయుడి కాలంలో నకాశీల చేతుల్లో పొనికి కొమ్మ బొమ్మగా రూపుదిద్దుకుంది. వందల ఏళ్ల కిందటి ప్రాచీనకళగా ఈ బొమ్మల తయారీ కొనసాగుతోంది. తరాలు గడిచినా నకాశీలు తమ వారసత్వాన్ని ఇంకా కాపాడుకుంటూ వస్తున్నారు. సరైన ప్రోత్సాహం లేక, ప్రజాదరణ కూడా తగ్గుతుండటంతో ఇప్పటికే చాలా కుటుంబాలు కొయ్యబొమ్మకు దూరమై.. ఇతర వృత్తులు, ఉపాధులు, ఉద్యోగాల్లో స్థిరపడ్డాయి. కానీ.. ఇప్పటికీ వారందరికీ తమకు గుర్తింపునిచ్చే కొయ్యబొమ్మ అంటే ప్రాణమే.
గట్టి ప్రయత్నమే..
అరుదైన ఈ హస్తకళను కాపాడుకోవడం అవసరమని గుర్తించిన వాళ్లూ ఉన్నారు. గత కలెక్టర్ వరుణ్‌రెడ్డి, డీఆర్‌డీవో విజయలక్ష్మి కొయ్యబొమ్మలకు కావాల్సిన పొనికిచెట్టు ఉనికిని కాపాడేందుకు విశేష కృషిచేశారు. మామడ మండలం లింగాపూర్, జగదాంబతండాల వద్ద, సారంగపూర్ మండలం మహబూబ్‌ఘాట్ ప్రారంభం వద్ద పొనికి వనాలను ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం లింగాపూర్, జగదాంబతండాల్లో వందల్లో పొనికిచెట్లు ఏపుగా పెరిగాయి. మహబూబ్‌ఘాట్ వద్ద కోతుల కారణంగా చెట్లు దెబ్బతింటున్నాయి.
న్యూస్‌రీల్
కొయ్యబొమ్మను కాపాడుకుందాం
కళాకారులను ప్రోత్సహిద్దాం
ఏపుగా పెరుగుతున్న పొనికి వనం
కావాలి కొయ్యబొమ్మకు ఊతం
Comments
Please login to add a commentAdd a comment