నిర్మల్‌చైన్‌గేట్: సంయుక్త కిసాన్ మోర్చా, జాయింట్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియ న్స్ పిలుపు మేరకు ఈనెల 26న జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్‌కుమార్ తెలిపారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సీఐటీయూ, గిరిజన సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలను గాంధీపార్క్ వద్ద ఉన్న ప్రజలకు గురువారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు డి.పోశెట్టి, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడసం శంభు , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గైని మురళీమోహన్, నిర్మల్ మండల అధ్యక్షుడు బర్కుంట గంగారం, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment