నిర్మల్‌చైన్‌గేట్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరించే కార్మిక, రైతు, వ్యవసాయ, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో సీఐటీయూ ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించగా ఆయన మాట్లాడారు. ఈనెల 26న దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం.. సహజ వనరులు, సంపద, ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు కట్టబెడుతుందని పేర్కొన్నారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్‌లుగా మార్చి సమ్మే హక్కులను కాలరాస్తుందని వివరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.గంగామణి, జిల్లా సహాయ కార్యదర్శి రాధ, జిల్లా కోశాధికారి బి.లలిత, జిల్లా కమిటీ సభ్యులు డి.పోశెట్టి, సత్తవ్వ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment