ప్రజాసమస్యలు తక్షణం పరిష్కరించాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజల సమస్యలను తక్షణం పరి ష్కరించాలని అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ అ ధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవా రం నిర్వహించిన ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. విద్య, వై ద్యం, ధరణి, పింఛన్లు, రెవెన్యూ, వ్యవసాయం తదితర సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శాఖ ల వారీగా వచ్చిన ప్రతీ ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, ప్రాధాన్యక్రమంలో పరిశీ లించాలన్నారు. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారులకూ పరి ష్కార అంశాల సమాచారం అందించాలన్నారు. అనంతరం శాఖల వారీగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార పురోగతిని సమీక్షించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా వాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇళ్ల ముందుకు మురుగు నీరు..
మేము నిర్మల్ మున్సిపాలిటీ 12వ వార్డు శాంతి నగర్ కాలనీలోని ఈఎస్‌ఐ ఆసుపత్రి, చర్చి రో డ్డులో నివాసం ఉంటున్నాం. కొంతమంది వ్యక్తులు తమ గృహ సముదాయాలలో డ్రైనేజీ వెళ్లకుండా అడ్డంగా మట్టి కుప్పలు వేశారు. ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురికి నీరు రోడ్లపై పారుతుంది. దోమలు వృద్ధి చెంది కాలనీ వాసులము జ్వరాల బారిన పడుతున్నారు.
అక్రమ వెంచర్లు తొలగించాలి..
గత ప్రభుత్వం 2008లో సర్వే నెంబర్ 558/ఉ లోని ప్లాట్లను న్యూ అస్రకాలోని వారికి ఇచ్చారు. మిగులుబాటు భూమి ధరణిలో ప్రవేటు భూమి గా నమోదు చేశారు. దీంతో కొందరు వ్యక్తులు వెంచర్‌గా చేసి ప్లాట్లను రిజిస్ట్రేషన్ లేకుండా సాదాబైనామాపై అమ్ముతున్నారు. ఈ భూమిని అస్రకాలనీ వాసుల కోసం కేటాయించి మినీ ఫంక్షన్ హాల్, పార్క్, లైబ్రరీ, రెసిడెన్షియల్ స్కూల్, కమిటీ హాల్ వంటివి నిర్మించాలి.
రుణాలు మాఫీ చేయాలి
మేము వాలేగ్గం గ్రామానికి చెందిన రైతులం. భార్య పేరు మీద రూ.2 లక్షలు, భర్త పేరు మీద రూ.2 లక్షల రుణం తీసుకున్న వారు మా గ్రామంలో దాదాపు 150 మంది ఉన్నారు. మాకు నేటికీ రుణమాఫీ కాలేదు. గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా అందరికీ రుణమాఫీ చేయాలి.
పరిహారం అందించాలి..
పట్టణ అభివృద్ధిలో భాగంగా చైన్‌గేట్ నుంచి బంగల్‌పేట వరకు రోడ్డు విస్తరణలో మా ఇల్లు కోల్పోయాము. అప్పుడు అధికారులు మాకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పటివరకు పరిహారం చెల్లించకపోగా, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా మంజూరు చేయలేదు. ఈ విషయమై పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. – వెంకటమ్మ, గాంధీచౌక్
కొత్త రుణం ఇవ్వడం లేదు..
నాకు పొనకల్ గ్రామంలో 314/1 లో 19 గుంటలు 408/ఆ/1లో ఆరు గుంటల భూమి ఉంది. 2022 నుంచి అధికారుల చుట్టూ తిరిగిన ధరణిలో నా పేరు కనిపించడం లేదు. దీనికి తోడు గత ప్రభుత్వంలో నేను తీసుకున్న రుణం మాఫీ అయింది. ప్రస్తుతం నేను రుణం తీసుకుందాం అంటే బ్యాంక్ అధికారులు ఇందుకు సంబంధించిన డాటా ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని చెబుతున్నారు. – రవి, పొన్కల్
Comments
Please login to add a commentAdd a comment