గణిత సామర్థ్యాల గుర్తింపునకే పరీక్షలు
నిర్మల్ రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న గణిత సామర్థ్యాలు, నైపుణ్యాలను వెలికితీసేందుకే వివిధ ప్రతిభ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా పరీక్షల అధికారి సిద్ధ పద్మ తెలిపారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ గణిత ఫోరం (టీఎఎంఎఫ్) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని దీక్ష కళాశాలలో జిల్లాస్థాయి గణిత ప్రతిభ పోటీలను బుధవారం నిర్వహించారు. వివిధ మండలాల్లో గెలుపొందిన పదో తరగతి విద్యార్థులు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. తెలుగు మీడియంలో ఆర్.సరిత, (జెడ్పీహెచ్‌ఎస్ కిసాన్‌గల్లి భైంసా) ప్రథమ, మానస (జెడ్పీహెచ్‌ఎస్ మున్యాల్) ద్వితీయ, యు.నితీష (జెడ్పీహెచ్‌ఎస్ తిమ్మాపూర్) తృతీయ, ఇంగ్లిష్ మీడియంలో రోహిత్‌కుమార్ (జెడ్పీహెచ్‌ఎస్ మస్కాపూర్) ప్రథమ, ఎన్.శతిక (జెడ్పీహెచ్‌ఎస్ వడ్యాల్) ద్వితీయ, హర్షవర్ధన్ (జెడ్పీహెచ్‌ఎస్ మస్కాపూర్) తృతీయ, రెసిడెన్షియల్ విభాగంలో ఎ.సాహిత్య (సోఫీనగర్ పాఠశాల) ప్రథమ, ఎం.సుష్మిత ద్వితీయ, పీ శ్వేత (భైంసా పాఠశాల) తృతీయ బహుమతులు సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. కార్యక్రమంలో టీఎంఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చట్ల శ్రీనివాస్, మనోహర్‌రెడ్డి, కోశాధికారి రమాదేవి, సెక్టోరియల్ అధికారి ప్రవీణ్‌కుమార్, దీక్ష కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్‌రెడ్డి, ప్రమోద్‌రావు, ఉపాధ్యాయులు రవికాంత్, అశోక్, గోపాల్‌రెడ్డి, సాయినాథ్, శేఖర్‌వర్మ, రవి, మమత, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment