‘ఇందిరమ్మ’ దరఖాస్తులపై సర్వే చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలు ఈ నెలాఖరులోపు సేకరించాలని రా ష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. బుధవారం సచివాలయం నుంచి సీఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, టీపీఎస్‌సీ చైర్మన్ బుర్ర వెంకటేశం, రాష్ట్ర ఉన్నతాధికారులతో మంత్రి ఇందిరమ్మ ఇండ్లు, గ్రూప్–2 పరీక్షల నిర్వహణ, నూతన డైట్ మె నూ పెంపు ప్రారంభోత్సవం కార్యక్రమం, సంక్షేమ వసతిగృహల తనిఖీ తదితర అంశాలపై క లెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. ప్రతీ 500 దరఖాస్తుల సర్వే కోసం ఒక సర్వేయర్, అవసరమైన సిబ్బందిని గుర్తించి రెండురోజుల్లో శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. గ్రూప్–2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిర మ్మ ఇళ్ల కోసం 1,92,233 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రానున్న 20రోజుల్లో పూర్తిస్థాయిలో సర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 8,080 మంది అభ్యర్థులు గ్రూప్–2 పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. 24 పరీక్షాకేంద్రాలను సిద్ధం చేశామని చెప్పారు. సీఎస్‌లు, సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎస్పీ జానకీ షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, అదనపు ఎస్పీ ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీవో జీవరత్నం, జెడ్పీ సీఈవో గోవింద్, డీఈవో పీ రామారావు, డీపీవో శ్రీనివాస్, సంక్షేమ శాఖల అధికారులు శ్రీనివాస్, రాజేశ్వర్‌గౌడ్, మోహన్‌సింగ్, ము న్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, రీజినల్ కో ఆర్డినేటర్ పీజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
Comments
Please login to add a commentAdd a comment