మూడో రోజుకు వెంకటేశ్ దీక్ష
కుంటాల: మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కోరుతూ మిషన్ కుంటాల చైర్మన్ దొనికెన వెంకటేశ్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారం మూడోరోజుకు చేరింది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ దీక్ష శిబిరాన్ని సందర్శించి వెంకటేశ్‌కు మద్దతు తెలిపారు. తక్షణమే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఓయూ జేఏసీ నాయకులు, ఫౌండేషన్ సెక్రటరీ యోగేశ్, సీఈవో అనిల్‌కుమార్, బరుకుంట ప్రవీణ్, భువ లక్ష్మణ్, రాజు, గజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment