ఓడినవారికి నిధులెలా ఇస్తారు?
● అసెంబ్లీలో ముధోల్ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్..
భైంసాటౌన్: నియోజకవర్గాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని, ఇది ప్రజాతీర్పుతో గెలిచిన ఎమ్మెల్యేలను అవమానించడమేనని ముధోల్ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ అన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా సభలో ఆయన తన వాణి వినిపించా రు. ముందుగా అసెంబ్లీ ఆవరణలో తెలంగాణతల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రత్యేక తె లంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ చిన్నమ్మగా పి లుచుకునే స్వర్గీయ సుష్మాస్వరాజ్ పాత్ర కీలకమని, తెలంగాణ ఏర్పాటులో ఆమె పాత్రను విస్మరించడ డం సరికాదన్నారు. ఏ ఒక్కరి కారణంగా తెలంగా ణ రాలేదని, ఎంతోమంది ఆత్మబలిదా నాలతోనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. నియోజ కవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రొటోకాల్ సమస్య ఎదుర్కొంటున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేల కు నిధులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ప్రజా తీర్పును గౌరవించాలని స్పీకర్ ద్వారా ప్రభుత్వాని కి సూచించారు. అంతకు ముందు అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్‌బాబు, పాయల్ శంకర్‌తో కలిసి ట్రాక్టర్‌పై వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment