సైన్స్‌ఫెయిర్ జిల్లాస్థాయి విజేతలకు సన్మానం
నిర్మల్‌ఖిల్లా: ఇటీవల జిల్లా స్థాయిలో నిర్వహించిన 52వ బాలల విజ్ఞాన, ఇన్‌స్సైర్ మేళాలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పట్టణంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం సోమవారం సన్మానించారు. జిల్లా కేంద్రంలోని ఈద్గాం బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు ఆర్.సవిత, ఎన్. అంజలి, జె.నయన సైన్స్ మేళాలో పాల్గొనగా.. వీరిలో ఆర్.సవిత ప్రాజెక్టు జిల్లాస్థాయి ద్వితీ య బహుమతి సాధించింది. ఈ సందర్భంగా వీరిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీటీడీవో జె.అంబాజీ, ఏసీఎంవో శివాజీ, క్రీడ ల అధికారి రమేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.తుకారాం, గైడ్ టీచర్లు జయశ్రీ, పి.శ్రీలత, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
పొన్కల్ పాఠశాలలో..
మామడ: జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌లో విజేతలుగా నిలిచిన పొన్కల్ పాఠశాలకు చెందిన వి ద్యార్థులను పాఠశాలలో ఉపాధ్యాయులు, గ్రా మస్తులు సోమవారం అభినందించారు. విద్యార్థులు నేహమదులిత, నిష్కల్‌రెడ్డి, అజయ్, ఎన్‌సీసీ విద్యార్థులను అభినందించారు. జిల్లాలోనే ఎక్కువ బహుమతులను పొన్కల్ పాఠశా ల విద్యార్థులు గెలుపొందడం హర్షణీయమని హెచ్‌ఎం అరవింద్ అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment