108 అంబులెన్స్‌కు పూజలు
లక్ష్మణచాంద: మండల కేంద్రానికి ఇటీవల నూ తనంగా 108 అంబులెన్స్ వాహనం మంజూరు చేసింది. డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు ప్రత్యేక చొరవతో లక్ష్మణచాంద మండలా నికి అంబులెన్స్ మంజూరు చేయించారు. దీంతో సోమవారం మండల కేంద్రానికి వచ్చిన నూతన 108 వాహనానికి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజేశ్వర్, నిర్మల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాసులు మాట్లాడారు. మండలానికి 108 వాహనం లేకపోవడంతో మండలంలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు సంభవించినా, ఇతర అత్యవసర సమస్యలు ఎదురైనా మామడ నుంచి 108 వాహనం కోసం ఎదురు చూడాల్సి వచ్చేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో నూతనంగా 108 అంబులెన్స్ మంజూరు అయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, తాజా మాజీ జెడ్పీటీసీ రాజేశ్వర్, నాయకులు రవి, సురేశ్, భీమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment