క్రీడల్లోనూ రాణించాలి
నిర్మల్ రూరల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆర్డీవో రత్న కళ్యాణి సూచించారు. మండలంలోని చిట్యాల ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన సీఎం కప్ మండలస్థాయి పోటీలను ఆమె ప్రారంభించా రు. రత్నాపూర్ కాండ్లీ, తల్వేద, లంగడాపూర్, వెంగవాపేట్, ముజిగి, చిట్యాల గ్రామాల నుంచి సుమారు 180 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, కబడ్డీ, చెస్ పోటీలు నిర్వహించారు. విజేతలను జిల్లాస్థాయికి ఎంపిక చేశారు. ఇందులో ఎంపీడీవో గజానన్, రూరల్ ఎంఈవో వెంకటేశ్వర్, ఎంపీవో శ్రీనివాస్‌గౌడ్, ఏపీవో తుల రామకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు వెన్నెల, జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment