లోకేశ్వరం: బాల్య వివాహాలను అరికట్టాలని చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యుడు నాగభూషణ్ కోరారు. మండలంలోని మన్మద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా నాగభూషణ్ మాట్లాడుతూ గ్రామాల్లో బాల్య వివాహాలు జరిగితే తమకు సమచారం అందించాలన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించొద్దని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం దేవేందర్, ఉపాధ్యాయులు రాజేందర్, సుధీర్‌కుమార్, ప్రశాంత్, విజయకుమారి పాల్గొన్నారు.
ప్రతిజ్ఞ చేయిస్తున్న చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యుడు నాగభూషణ్
Comments
Please login to add a commentAdd a comment