పంచాయతీ ఎన్నికలకు పటిష్ట చర్యలు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సవరించిన ఓటరు జాబితా ప్రకారం నాలుగు కొత్త గ్రామ పంచాయతీలు కలుపుకుని మొత్తం 400 గ్రామపంచాయతీల్లో 3,368 వార్డుల్లో 3,368 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. పెరిగిన కొత్త గ్రామ పంచాయతీలలో ఖానాపూర్ మండలం రంగపేట, కడెం మండలం న్యూధర్మాజీపేట, తానూర్ మండలం కళ్యాణి, కుభీర్ మండలం రాంసింగ్ తాండ గ్రామాలు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 2,33,687 మహిళా ఓటర్లు, 2,12,517 పురుష ఓటర్లు, 15 మంది ఇతర ఓటర్లతో కలుపుకుని మొత్తం 4,46,219 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఓటరు జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు ఉంటే మండల స్థాయిలో జరగబోవు సమావేశంలో రాత పూర్వకంగా అధికారులకు వివరిస్తే, వాటిని విచారణ చేసి తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, డీఎల్పీవో రమేశ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రవణ్‌రెడ్డి, గండ్రత్ రమేశ్, సిరికొండ రమేశ్, గాజుల రవి, మజార్, నరేశ్ పాల్గొన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్
Comments
Please login to add a commentAdd a comment