‘ఇందిరమ్మ’ సర్వేకు సహకరించాలి
భైంసాటౌన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టనున్న సర్వేకు దరఖాస్తుదారులు సహకరించాలని మున్సిపల్ వైస్‌చైర్మన్ ఎండీ.జాబీర్ అహ్మద్ కోరారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం పట్టణంలో 12,711 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఈ మేరకు ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికకు సర్వే చేపడుతుందన్నారు. సర్వే బృందం దరఖాస్తుదారుల ఇంటికి వచ్చినప్పుడు వారు అడిగే వివరాలతోపాటు సంబంధిత ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు.
● గతంలో ఇందిరమ్మ కింద లబ్ధి పొందారా..?
● సొంత ఇంట్లో ఉంటున్నారా.. అద్దె ఇల్లా..
● అద్దె ఇంట్లో ఉంటే అది ఆర్‌సీసీనా రేకులు, కూనల ఇళ్లా..
● గోడలు ఇటుకలతో కట్టినవా, రేకులు, ఇతరత్రా..
● దరఖాస్తుదారు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు, ఖాళీస్థలం వద్ద దిగిన మూడు ఫొటోలు దగ్గర ఉంచుకోవాలి.
● అలాగే ఇంటిలోపలి ఫొటోలు సైతం మూడు అందుబాటులో ఉండాలి.
● ఇంటి కుటుంబసభ్యుల వివరాలు, వారి వివాహ స్థితిగతులు..
● ఖాళీస్థలం ఉంటే, ఫొటో, సర్వే నంబరు, విస్తీర్ణం, సంబంధిత డాక్యుమెంట్, సాదాబైనామా, తదితర వివరాలు,
● కరెంట్ బిల్లు, మున్సిపల్ ట్యాక్స్, పొజిషన్ సర్టిఫికెట్ వగైరా..
● పట్టణంలో ఎన్నేళ్ల నుంచి నివాసముంటున్నారు.. వంటి వివరాలు అడుగుతారని పేర్కొన్నారు. ఆందోళన చెందకుండా ముందస్తుగా సంబంధిత ధ్రువపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం సర్వే బృందం దరఖాస్తుదారుల వివరాలను యాప్‌లో నమోదు చేస్తారని, అర్హుల జాబితా ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment