● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: గ్రూప్–2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షల నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్రూప్–2 పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 24 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 8,080 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని పేర్కొన్నారు. ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు శిక్షణ అందించాలన్నారు. పరీక్ష పత్రాలను తీసుకువెళ్లేందుకు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విధించడం జరుగుతుందన్నారు. పరీక్షలు డిసెంబర్ 15(ఆదివారం) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు, 16న (సోమవారం) ఉదయం 10 నుండి 12:30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని వివరించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనల ప్రకారం అభ్యర్థులు వ్యవహరించాలని తెలిపారు. కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్లు, తాగునీరు, తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో అభ్యర్థుల సౌకర్యార్థం ఆయా రూట్లలో అవసరమైన బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పరీక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు అదనపు ఎస్పీ ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో రత్నాకళ్యాణి, పబ్లిక్ సర్వీస్ రీజినల్ కోఆర్డినేటర్ పీజీ.రెడ్డి, విద్యాశాఖ అధికారి పి.రామారావు, ఆర్ఐవో పరశురాం, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ రామ్మోహన్, నిర్మల్ పట్టణ, గ్రామీణ తహసీల్దార్లు రాజు, సంతోష్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment