సర్వీస్ రోడ్డు కోసం ఆందోళన
సోన్: మండలంలోని కడ్తాల్ గ్రామస్తులు సర్వీస్ రోడ్డు కోసం మంగళవారం ఆందోళన చేపట్టారు. 44 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా గ్రామంలో ఫ్లైఓవర్ నిర్మించారని దీంతో సర్వీస్ రోడ్డు లేకుండా రహదారి నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న సర్వీస్ రోడ్డును రహదారిలో కలపడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. సర్వీస్ రోడ్డు ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.
గ్రామస్తులతో మాట్లాడిన డీఎస్పీ,
తహసీల్దార్..
గ్రామస్తుల ఆందోళన విషయం తెలుసుకున్న డీఎస్పీ గంగారెడ్డి, తహసీల్దార్ మల్లేశ్ అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. సర్వీస్ రోడ్డు వదిలేస్తేనే ఆందోళన విరమిస్తామని గ్రామస్తులు చెప్పడంతో విషయాన్ని ఎన్‌హెచ్‌ఎఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత కాంట్రాక్టర్ సర్వీస్ రోడ్డు వెంట వాహనాలు వెళ్లకుండా తాత్కాలికంగా భారీ డివైడర్లు ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. సమస్యను పూర్తిగా పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. ముందస్తు చర్యగా సోన్ సీఐ నవీన్ కుమార్, ఎస్సై గోపి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment