ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
భైంసాటౌన్: దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్ అన్నారు. పట్టణంలో స్నేహ సొసైటీ, లయన్స్‌క్లబ్ ఆఫ్ భైంసా డైమండ్ ఆధ్వర్యంలో మంగళవారం దివ్యాంగుల దినోత్స వం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దివ్యాంగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే యూడీఐడీ కార్డు, సదరం సర్టిఫికెట్ కలిగి ఉండాలన్నారు. వీటితో ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. త్వరలోనే భైంసా ఏరియాస్పత్రిలో సదరం శిబిరం నిర్వహిస్తామని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో భైంసా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, స్నేహ సొసైటీ అధ్యక్షుడు మహిపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment