సోన్: గోవుల సంరక్షణే లక్ష్యంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోరక్ష మహా పాదయాత్ర చేపట్టిన బాలకృష్ణ గురుస్వామి బృందం మంగళవారం మండల కేంద్రానికి చేరుకుంది. మండలంలోని అయ్యప్ప స్వాములు బాలకృష్ణ గురుస్వామి, ఆయన బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ గోరక్ష మన అందరి బాధ్యత అన్నారు. అందరికీ అవగాహన కల్పించేందుకే మహా పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. మండల అయ్యప్ప స్వాములు ఐబీ నుంచి నిజామాబాద్ సరిహద్దు వరకు ఆయనతో పాదయాత్ర చేశారు. కార్యక్రమంలో ముత్కపల్లి నరేశ్ గురుస్వామి, ఓం ప్రకాష్, ప్రశాంత్, గంగాధర్ జోషి, శివ, మామిడాల సంతోష్, గడ్డం నరసయ్య, సత్యనారాయణ, కిరణ్, నవకాంత్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment