వేసవిలో ‘ప్రాణహిత’!
● డా.బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టుకు సర్కారు పచ్చజెండా ● రానున్న ఎండాకాలంలో పనులు ప్రారంభించే అవకాశం ● నీటి పారుదలశాఖ మంత్రి ప్రకటనతో ఆశలు ● హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా రైతులు
‘కాళేశ్వరం’ ప్రాజెక్టుతో ఉనికిని కోల్పోయిన ప్రాణహిత– చేవేళ్ల ప్రాజెక్టు మళ్లీ జీవం పోసుకోనుంది. ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చుట్టూ అపారమైన నీటి వనరులున్నాయి. పెన్‌గంగ, వార్దా, వెన్‌గంగ, ప్రాణహిత, గోదావరి నదుల నీరు పొలాలకు చేరడం లేదు. ఈ నేపథ్యంలో ప్రాణహిత ప్రాజెక్టుపై రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు.
కౌటాల(సిర్పూర్): ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ ఖ ర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగు నీరందించాలనే ఉద్దేశంతో కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద 2008 డిసెంబర్ 16న ప్రాణహిత ప్రాజెక్టుకు శ్రీకా రం చుట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొదలు కుని ఏడు ఉమ్మడి జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాలకు సాగు నీటిని పారించాలనేది లక్ష్యం. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత పాలకులు పదేళ్లుగా ప్రా ణహిత ప్రాజెక్టును పట్టించుకోలేదు. గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత తక్కువ ఉందని, ఈ ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించింది. ఈ తరుణంలో ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం కలగానే మిగి లిపోతుందని ఆందోళనలు మొదలయ్యాయి. ప్రస్తు త కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును మళ్లీ తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలని నిర్ణయించింది.
బడ్జెట్‌లో నిధులు..
కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్లు, అంచనాలను సవరించి రానున్న వేసవిలో శంకుస్థాపన చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించే అంశాన్ని పునఃపరిశీలిస్తున్నారు. నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్లనున్నారు. గత డిజైన్లు, నీటి లభ్యతను సమీక్షించి బరాజ్‌ను తప్పనిసరిగా కడతామని రాష్ట్ర మంత్రి స్పష్టం చేశారు. రానున్న రెండు, మూడు నెలల్లో ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంపై స్పష్టత రానుంది. రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో ప్రాణహిత– చేవెళ్ల ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ.248.99 కోట్ల నిధులు కేటాయించింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు నిర్మాణంపై చర్చ జరగనుంది.
వార్దానా.. తుమ్మిడిహెట్టినా..?
ప్రాణహిత– చేవేళ్ల ఎత్తిపోతల పథకంలో ప్రాణహి త నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీకి 2008లో రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో శ్రీకారం చు ట్టారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం ప్రత్యేక రాష్ట్రంలో ప్రధాన బ్యారేజీని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ వద్దకు మార్చడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించాలన్న లక్ష్యం నెరవేరలేదు. తుమ్మిడిహెట్టికి బదులు ప్రత్యామ్నాయంగా సమీప వార్దా నదిపై బ్యారేజీ నిర్మించాలని గత ప్రభుత్వం 2022లో నిర్ణయించింది. రూ.4,470.76 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతులు మంజూరైనా పనులు మొదలవ్వలేదు. ఉమ్మడి రా ష్ట్రంలో ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా 70 కిలో మీ టర్ల పొడవు కాలువల తవ్వకాలు పూర్తిచేశారు. ప్ర స్తుతం వార్దాపై ప్రాజెక్టు నిర్మిస్తారా.. ప్రాణహిత న దిపై బ్యారేజీ నిర్మిస్తారనే అనే చర్చ రైతుల్లో సాగుతోంది. ఎక్కడ బ్యారేజీ నిర్మించినా పనులు ప్రారంభించి పూర్తిచేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది
Comments
Please login to add a commentAdd a comment