నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Published Mon, Dec 23 2024 12:06 AM | Last Updated on Mon, Dec 23 2024 12:05 AM

నిర్మ

నిర్మల్‌

పరిశోధిస్తే ఫలితాలెన్నో..
కవ్వాల్‌ టైగర్‌జోన్‌ అరుదైన జీవజాతులకు నిలయం. గతంలో అరుదైన కప్పను చూపించిన ఈ ప్రాంతం తాజాగా షటిల్‌ కాక్‌ మష్రూమ్‌లను పరిచయం చేసింది.

సోమవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

8లోu

నర్సింగ్‌ కళాశాల నిర్వహిస్తున్న

పీజీ కళాశాల భవనం

నిర్మల్‌చైన్‌గేట్‌: నిర్మల్‌కు మంజూరైన ప్రభుత్వ మహిళా నర్సింగ్‌ కాలేజీని సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 2న వర్చువల్‌ పద్ధతిన ప్రారంభించారు. కళాశాలలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేక హాస్టల్‌, తరగతుల నిర్వహణకు జాప్యం జరుగుతోంది. 20 రో జులుగా నర్సింగ్‌ ఆఫీసర్లతో ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థినులు తమ ఇళ్లలోనే ఉండి ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నారు. ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓరియంటేషన్‌ క్లా సుల ద్వారా ఫ్యాకల్టీలు తొలి సెమిస్టర్‌లోని అంశాలను బోధిస్తున్నారు. ప్రిన్సిపాల్‌ శకుంతల, వైస్‌ ప్రి న్సిపాల్‌ మంజుల బోధన తీరును పర్యవేక్షిస్తున్నా రు. ఇదే సమయంలో కాలేజీకి అవసరమైన ఏర్పా ట్లు, వసతుల కల్పనపై చర్యలు తీసుకుంటున్నారు.

నర్సింగ్‌ ఆఫీసర్లతో తరగతులు

నిర్మల్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌)లో విధులు నిర్వహిస్తున్న ఎమ్మెస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన ఆరుగురు నర్సింగ్‌ ఆఫీసర్లతో విద్యార్థినులకు ఆన్‌లైన్‌లో విద్యాబోధన చేయిస్తున్నారు. వారితోపాటు ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ కూడా పాఠాలు చెబుతున్నారు. నిర్మల్‌ నర్సింగ్‌ కాలేజీలో చేరిన 60 మందిలో జిల్లాతోపాటు హైదరాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, మంచిర్యాల తదితర ప్రాంతాలకు చెందిన వారున్నారు. వీరందరికీ కాలేజీతోపాటు వసతి, సౌకర్యాల కల్పన పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్న తాత్కాలిక ఏర్పాట్లు

కాలేజీతోపాటు హాస్టల్‌ నిర్వణకు పక్కా భవనం లే క పీజీ కళాశాల భవనాన్ని తాత్కాలికంగా ఉపయోగిస్తున్నారు. అవసరమైన ఫర్నిచర్‌ భవనంలోని గదుల్లో ఏర్పాటు చేసినా.. పూర్తిస్థాయిలో సౌకర్యాలు సమకూర్చే పనులు ఇంకాపూర్తి కాలేదు. దీంతో హాస్టల్‌, తరగతుల నిర్వహణకు ఆలస్యమవుతోంది. తొలి సెమిస్టర్‌ సిలబస్‌ సకాలంలో పూర్తి చేయాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌లో విద్యార్థినులకు తరగతులు నిర్వహిస్తున్నారు.

పూర్తికాని ఉద్యోగుల నియామకం

నర్సింగ్‌ కాలేజీలో ఉద్యోగుల నియామక ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. నర్సింగ్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ను మాత్రమే నియమించారు. మిగతా ఫ్యాకల్టీతోపాటు అవసరమైన పూర్తిస్థాయి కార్యాలయ, సెక్యూరిటీ సిబ్బందిని నియమించలేదు. ఇందుకు సంబంధించిన జీవో ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ విడుదల కాలేదు.

ఆన్‌లైన్‌లోనే బోధిస్తున్నాం

నిర్మల్‌ ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలో సౌకర్యాల కల్పన శరవేగంగా సాగుతోంది. పనులు పూర్తి కావడానికి కొంతసమయం పడుతుంది. అందుకే తొలి సెమిస్టర్‌ క్లాసులను ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నాం. ఇందుకోసం నర్సింగ్‌ ఆఫీసర్లతో విద్యాబోధన చేయిస్తున్నాం. మిగతా ఉద్యోగులు, సిబ్బంది నియామకానికి ప్రభుత్వం నుంచి జీవో రావాల్సి ఉంది.

– శకుంతల, నర్సింగ్‌ కళాశాల, ప్రిన్సిపాల్‌

న్యూస్‌రీల్‌

కొలిక్కిరాని స్థల సేకరణ

నర్సింగ్‌ కాలేజీ కోసం పక్కా భవన నిర్మాణంతో పాటు అవసరమైన ఫర్నిచర్‌ను సమకూర్చడానికి రూ.26 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. కాగా, కాలేజీ నిర్వహణ కోసం మాత్రం ఇప్పటివరకు బడ్జెట్‌ విడుదల కానట్లు తెలిసింది. మరోవైపు అనుకూలమైన స్థలం కోసం అధికారులు పరిశీలన చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కురాన్నపేట్‌ సీతాసాగర్‌ చెరువులోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్‌–422, విశ్వనాథ్‌పేటలోని సర్వే నంబర్‌–199లో గల ప్రభుత్వ భూమి, స్థానిక డిగ్రీ కాలేజీ ప్రాంగణంలోని ప్రభుత్వ భూమిని ఇటీవల పలువురు అధికారులు పరిశీలించారు. కానీ, స్థల సేకరణపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

పీజీ కళాశాల భవనంలోనే

నర్సింగ్‌ కళాశాల నిర్వహణ

శాశ్వత భవనానికి చర్యలు

స్థల సేకరణలో అధికారులు

ఫస్టియర్‌లో 60 సీట్లు భర్తీ

నర్సింగ్‌ ఆఫీసర్లతోనే పాఠాలు

No comments yet. Be the first to comment!
Add a comment
నిర్మల్‌1
1/2

నిర్మల్‌

నిర్మల్‌2
2/2

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement