టీజీబీ సిబ్బందిపై ఫిర్యాదు
బేల: ఆదివాసీ రైతు ఖాతాలోంచి రూ.50 వేలు కాజేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బందిపై శనివారం బాధిత రైతు ఆత్రం రాందాస్‌తో కలిసి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు సామ రూపేష్‌రెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మణియార్‌పూర్‌కు చెందిన ఆత్రం రాందాస్ గత ఆగస్టు 28న బ్యాంకుకు వెళ్లి రూ.50వేలు కావాలని విత్‌డ్రా రశీదును క్యాషియర్‌కు ఇవ్వగా అంత ఇవ్వలేమని, ఆ రశీదు అలాగే ఉంచుకుని రూ.20వేలు మాత్రమే ఇవ్వొచ్చని చెప్పాడన్నారు. ఈక్రమంలో బాధితుడి నుంచి రూ.20వేల విత్‌డ్రా రశీదు రాయించుకుని ఖాతాదారునికి నగదు అందజేశారన్నారు. అమాయకుడైన బాధిత రైతు ఇది గమనించుకోకుండా మరోసారి ఖాతా నుంచి రూ.50వేలు కావాలని వెళ్తే ఖాతాలో అసలు డబ్బులు లేవని క్యాషియర్ చెప్పారన్నారు. దీంతో బాధిత రైతు దీనిపై పలుమార్లు బ్యాంకులో అడిగితే సమాధానం దాటేవేస్తున్నారన్నారు. వారి వెంట గ్రామ రైతులు ఠాక్రే గంభీర్, బొక్రే పాండురంగ్, విపుల్, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment