సాదాబైనామాలపై ఆశలు
● తెలంగాణ భూభారతితో మోక్షం ● పదేళ్ల నిరీక్షణకు తెర పడేనా..? ● జిల్లాలో 7,472 దరఖాస్తులు ● అమల్లోకి ఆర్వోఆర్–24 చట్టం
నిర్మల్‌చైన్‌గేట్/భైంసాటౌన్: సాదాబైనామాల ద్వారా భూములు కొనుగోలు చేసిన రైతుల ఆశలు నెరవేరనున్నాయి. సాదాబైనామాల భూములకు సంబంధించి రికార్డుల లేకపోవడం, పట్టాదారులుగా గుర్తించలేని పరిస్థితులు నెలకొనడం లాంటి కారణాలతో ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాలకు నోచుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ భూ భారతి బిల్లు–2024తో వారి నిరీక్షణకు తెరపడే అవకాశాలున్నాయి. శాసనసభలో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టిన ఆర్వోఆర్ చట్టం–2024 బిల్లుతో జిల్లాలో 7,472 మంది సాదాబైనామాలకు సంబంధించిన ఇబ్బందులు తొలగనున్నాయి.
ధరణిలో కనిపించని ఆప్షన్లు
గత ప్రభుత్వం 2020లో ధరణి పోర్టల్ తీసుకువచ్చి దాని ద్వారానే భూ నిర్వహణను కొనసాగించింది. అయితే ధరణిలో అన్ని రకాల ఆప్షన్లు లే కపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డా రు. అందులో సాదాబైనామాలు కూడా ఒకటి. ధరణిలో సాదాబైనామా దరఖాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ల కోసం ఆప్షన్లు లేక చాలామంది గత ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. వారి విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న అప్పటి ప్రభుత్వం సాదాబైనామాల పరిష్కారానికి చర్యలు చేపడతామని మూడేళ్ల కిందటే దరఖాస్తులు స్వీకరించినా నిరాశే ఎదురైంది.
అందనున్న పథకాలు
భూ భారతి చట్టం అమలులలోకి వస్తే తెల్ల కాగి తాలపై భూములు కొనుగోలు చేసిన రైతులకు ఇక భూహక్కు వర్తించనుంది. క్షేత్రస్థాయిలో సా గు చేసుకుంటున్నప్పటికీ రికార్డుల్లో వారి పేర్లు లేవు. దీంతో వారికి రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలు వర్తించలేదు. రికార్డుల్లో వారి కి భూమి విక్రయించిన వారి పేర్లు ఉండటంతో యాజమాన్య హక్కులు లేకుండా పోయాయి. దీంతోపాటు క్షేత్రస్థాయిలో భూములు విక్రయించిన వారసులతో ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని సంఘటనలు పోలీస్ ఠాణాల వరకు వెళ్లా యి. అసలు పట్టాదారుకు సంబంధించిన వారసులు, సంబంధీకులు తెల్ల కాగితాలు, బాండు పేపర్లపై భూములు కొనుగోలు చేసిన వారి నుంచి తిరిగి భూములు తీసుకోవడానికి ప్రయత్నించారు. వ్యవసాయ భూములు స్థిరాస్తి వ్యాపారానికి అనుకూలంగా మారిన ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చట్టం అమల్లోకి తెస్తే ఈ సమస్యలకు పరిష్కారం దొరకనుంది.
ఏళ్లుగా ఎదురుచూపు
సాదాబైనామా సమస్యను పరిష్కరించడంలో గత ప్రభుత్వం జాప్యం చేసింది. దీంతో ఆయా దరఖాస్తుదారులంతా సాదాబైనామాల రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి సమస్యలు పరిష్కరించేందుకు కొత్తగా భూభారతి ఆర్వోఆర్ చట్టం–2024ను తీసుకువస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. త్వరలోనే ఈ చట్టం అమల్లోకి రానుంది. దీంతో సాదాబైనామా సమస్య పరిష్కారం కానుంది.
మండలాల వారీగా
సాదాబైనామాకు వచ్చిన దరఖాస్తులు
మండలం దరఖాస్తుల సంఖ్య
బాసర 57
భైంసా 172
దస్తురాబాద్ 789
దిలావర్‌పూర్ 572
కడెం–పెద్దూర్ 879
ఖానాపూర్ 323
కుభీర్ 576
కుంటాల 273
లక్ష్మణచాంద 569
లోకేశ్వరం 669
మామడ 1,042
ముధోల్ 640
నర్సాపూర్ (జి) 245
నిర్మల్ అర్బన్ 36
నిర్మల్‌రూరల్ 460
పెంబి 68
సారంగపూర్ 561
సోన్ 280
తానూరు 63
Comments
Please login to add a commentAdd a comment