పొన్కల్ హైస్కూల్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు
మామడ: మండలంలోని పొన్కల్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఎస్‌సీఈఆర్టీ (రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి) ఫర్ బెస్ట్ ప్రాక్టిసెస్ అవార్డు అభించింది. జిల్లాలో ఉత్తమ పాఠశాలగా గుర్తింపుతో పాటు రాష్ట్ర అవార్డుకు నామినేట్ అయింది. పాఠశాలలో చదువుతో పాటు ఎన్‌సీసీ, పరీక్షల ఫలితాలు, సైన్స్‌ఫేర్‌కు సంబంధించి విద్యార్థుల సమగ్ర ప్రతిభను తెలిపే వివరాలను రాష్ట్రస్థాయికి పంపించారు. జిల్లాలో మస్కాపూర్ ఉన్నత పాఠశాల తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు పొన్కల్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుతున్నారు. పాఠశాలలో 578 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గత మూడేళ్లుగా పాఠశాల నుంచి పదో తరగతిలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఈ ఏడాది ఐదుగురు బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు మైస అరవింద్‌కుమార్ తెలిపారు. అలాగే ఉపాధ్యాయుల చొరవతో జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్‌లో వి ద్యార్థులు ప్రదర్శించిన ఐదు ఎగ్జిబిట్‌లు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. స్వాగత గీతం ప్రదర్శించిన విద్యార్థులు పలువురి ప్రశంసలు, బహుమ తి అందుకున్నారు. పాఠశాలలో 578మంది వి ద్యార్థుల్లో 100మంది ఎన్‌సీసీ కెడెట్లుగా ఉన్నారు. మండలంలో నిర్వహించే జాతరలు, వివిధ కార్యక్రమాల్లో ఎన్‌సీసీ విద్యార్థులు చేపట్టే సామాజిక కార్యక్రమాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment