సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి
సారంగపూర్: స్వర్ణ ఆయకట్టు కింద రబీలో పంటలు సాగుచేసే రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సూచించారు. మండలంలోని స్వర్ణ ప్రాజెక్ట్ నుంచి ఆది వారం ఆయన సాగునీరు విడుదల చేశారు. అ నంతరం సాగునీటి లభ్యత గురించి ప్రాజెక్ట్ ఏఈ మధుపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రాజెక్ట్ ఎడమ, కుడి, మధ్య (జౌళి నాలా) కాలువల ద్వా రా విడుదల చేసిన సాగునీటిని పొదుపుగా విని యోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకొస్తున్న కాంగ్రెస్ సర్కారు రైతులకు చేసిందేమీ లేదని ఆరోపించారు. రైతు భరోసాపై స్పష్టతనివ్వడంలేదని విమర్శించారు. వెంటనే రైతు భ రోసా, పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ హాదీ, నాయకులు విలాస్, రాంశంకర్‌రెడ్డి, గంగారెడ్డి, రాంనాథ్, తిరుమలా చారి, పోతన్న, భోజన్న, సాహెబ్‌రావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment