ఎలకి్ట్రసిటీ ఎస్టీ జిల్లా కార్యవర్గం
నిర్మల్‌చైన్‌గేట్: ఎలకి్ట్రసిటీ ఎస్టీ అసోసియేషన్ జిల్లా సర్వసభ సమావేశంలో ఏడీఈ కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీ లక్ష్మణ్‌నాయక్ ఆధ్వర్యంలో జిల్లా ఎన్నికలు ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా అంబాజీనాయక్, కార్యదర్శిగా ము రళి నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాలయ్య, ట్రెజరర్‌గా వాగోజిని ఎన్నుకున్నారు.
జాగిలాలతో తనిఖీలు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్ మహాలక్ష్మివాడలో గల డబుల్ బెడ్రూం ఇళ్ల వ ద్ద ఆదివారం డీఎస్పీ గంగారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ వినియోగించే, విక్రయించేవా రిపై కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా, విక్రయించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తనిఖీల్లో ఎస్సై సాయికుమార్, యాంటీ నార్కోటిక్ డాగ్ టీం మహిపాల్, సాయన్న, కిరణ్, రెహమాన్, ప్రణీత్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment