నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సంబంధించి వైకల్య ధ్రువీకరణ కోసం జనవరి నెలకు సంబంధించి సదరం క్యాంపుల తేదీలను డీఆర్డీవో విజయలక్ష్మి ప్రకటించారు. జనవరి 7, 23, 28న ఆర్థో, సీవీఏ, 3న వినికిడిలోపం, 9న మానసిక వైకల్యం, 16న నేత్ర సంబంధ వైకల్యం పరీక్షలు ఉంటాయని వివరించారు. అర్హులైన వారు తమ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యునితో ఓపీ స్లిప్ ద్వారా దివ్యాంగ కేటగిరీ నిర్ధారించుకునిని దాని ప్రకారం మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుక్ అయినవారు మాత్రమే సదరం శిబిరానికి ఆయా తేదీల్లో ఉదయం 9 గంటలకు స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రావాలని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment