కలిసొచ్చిన కాలం..
నిర్మల్
ఆదివారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
శిశు మరణాలు నియంత్రించాలి
● డీఎంహెచ్‌వో రాజేందర్
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో శిశు మరణాలు నియంత్రించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ వైద్యాధికారులకు సూచించారు. జిల్లా వై ద్యఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ‘పిల్లల మరణాల‘ పై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం జరిగిన పిల్లల మరణాలు, దానికి కారణాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా సమీక్ష చేశారు. పిల్లల అధిక మరణాలకు కారణాలు తెలుసుకుని వాటిని నివారించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ నయనారెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వాసు జిల్లాలోని వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్: ఈఏడాది జిల్లా వ్యవసాయంలో పెద్దగా మార్పులేం లేవు. ప్రకృతి కొంత సహకరించడం, ప్రభుత్వం కొంత ఊరటనివ్వడం మినహా పెద్దగా ఫలితాలూ లేవు. గత ఏడాది ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. కొందరికి ఇంకా అందలేదు. సన్నాలకు బోనస్ ఇవ్వడం పండించిన రైతులకు ఊరట కలిగించింది. రైతుబీమా యథావిధిగా కొనసాగింది.
యాసంగిలో పెరిగిన సాగు..
గతేడాదితో పోలిస్తే ఈసారి యాసంగి సాగు గణనీయంగా పెరిగింది. గతేడాది సీజన్‌లో మొత్తం 2,73,818.23 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఈఏడాది 3,05,471.01 ఎకరాల్లో సాగు చేశారు. అంటే ఈసారి 31వేల ఎకరాలకు పైగా సాగు పెరిగింది. ఇందులో గతేడాది వరి 1.07 లక్షల ఎకరాల్లో వేయగా, ఈసారి 1.14 లక్షల ఎకరాల్లో వేశారు. మక్క సాగు గణనీయంగా పెరిగింది. పోయినసారి 83,839 ఎకరాల్లో పండించగా, ఈ ఏడాది 1,06,907 ఎకరాల్లో సాగైంది. శనగ సాగు మాత్రం గతేడాది 67,635 ఎకరాల్లో సాగవ్వగా, ఈసారి 55,975 ఎకరాల్లోనే పండించారు. మొత్తం మీద ఈసారి యాసంగిలో పంటసాగు మాత్రం పెరగడం గమనార్హం.
వానాకాలం పరవాలేదు..
జిల్లాలో గత రెండుమూడేళ్లతో పోలిస్తే ఈసారి వానాకాలం సాగుకు ప్రకృతి ఉపశమనం కలిపించింది. ఎందుకంటే.. మూడేళ్లుగా వానాకాలం సాగు ప్రారంభం కాగానే భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. దీంతో భారీగా నష్టం జరిగింది. ఈసారి మాత్రం అలాంటిదేం లేదు. వర్షం, వాతావరణం పూర్తిగా పంటలకు అనుకూలించింది. గత వానాకాలం 4,33,361 ఎకరాల్లో సాగు కాగా, ఈసారి 4.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వరి, మొక్కజొన్న, సోయా పంటలు మంచి దిగుబడి వచ్చాయి.
పెరిగిన ధాన్యం..
గత ఏడాది వానాకాలంతో పోలిస్తే.. ఈసారి ధాన్యం దిగుబడి పెరిగింది. గత ఖరీఫ్‌లో 1,37,104 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈసారి 203 కేంద్రాల ద్వారా 1,42,759 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం గమనార్హం. వానాకాలం కొనుగోలుకు సంబంధించి రూ.314కోట్లు చెల్లించారు. ఇందులో సన్నరకాలకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించారు.
నిర్మల్‌లో వివాహితపై లైంగికదాడి
నిర్మల్ జిల్లా కేంద్రంలో వివాహితపై లైంగికదాడి జరిగింది. ఆమె నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ఓ వ్యక్తి లాడ్జికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
8లోu
న్యూస్‌రీల్
జిల్లాలో పెరిగిన సాగు..
పలు పంటల్లో అధిక దిగుబడులు
రూ.2 లక్షల రుణమాఫీతో రైతుకు ఊరట
సన్నాలకు బోనస్ సంతోషం
రుణమాఫీ.. సన్నాలకు బోనస్..
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియను ఈ ఏడాది చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోనూ నాలుగు విడతల్లో మాఫీ ప్రక్రియ కొనసాగింది. జిల్లాలో మొత్తం 71,565 మందికి రూ.658.61 కోట్ల రుణమాఫీ అయింది. అర్హత ఉండి రుణమాఫీ కానివారు ఇంకా ఉన్నారు. రూ.2 లక్షలపైన ఒక్క రూపాయి ఎక్కువగా ఉన్నా మాఫీకాకపోవడంతో అలా కూడా చాలామంది నిరాశకు గురయ్యారు. ఇక రాష్ట్రప్రభుత్వం సన్నరకం ధాన్యం సాగును ప్రోత్సహించడానికి బోనస్ ప్రకటించింది. ఈఏడాది సన్నాలకు క్వింటాల్‌కు రూ.500బోనస్‌గా అందించారు. ఈమేరకు జిల్లాలో 6,700 మంది రైతులకు రూ.69.75 కోట్లు బోనస్‌గా అందింది.
Comments
Please login to add a commentAdd a comment