నుమాయిష్‌కు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

నుమాయిష్‌కు పటిష్ట ఏర్పాట్లు

Published Sun, Dec 29 2024 12:55 AM | Last Updated on Sun, Dec 29 2024 12:55 AM

నుమాయిష్‌కు పటిష్ట ఏర్పాట్లు

నుమాయిష్‌కు పటిష్ట ఏర్పాట్లు

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా కేంద్రంలో నిర్వహించే నుమాయిష్‌(ఎగ్జిబిషన్‌)కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నుమాయిష్‌ నిర్వహణపై అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజులు ‘నిర్మల్‌ ఉత్సవాలు’ పేరుతో స్థానిక ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో నుమాయిష్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, పెయింటింగ్స్‌, హస్తకళలు, మహిళా స్వయం సంఘాల ఉత్పత్తుల స్టాళ్లను ఏర్పాటు చేయాలని వివరించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి నుమాయిష్‌ విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమం ప్రజలందరికీ తెలిసేలా హోర్డింగ్స్‌ ఏర్పాటు చేసి, కరపత్రాలు పంచాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. చరిత్రకారులతో జిల్లా చరిత్రను తెలిపే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎగ్జిబిషన్‌ సందర్శనకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. పార్కింగ్‌ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లను చేయాలన్నారు. ప్రజలను ఆకర్షించేలా నుమాయిష్‌ పరిసర ప్రాంతాలను అందమైన లైటింగ్‌తో ముస్తాబు చేయాలని తెలిపారు. ఆసక్తి ఉన్న ప్రజలు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న వస్తువులను ప్రదర్శించేందుకు అనుమతి కోసం https:// docs.google.com/forms/d/1h5XUPVatFSTOHi0&ZjzkFWMRMZIynqxPQ& wXk8 rcQog/ edit ఆన్‌లైన్‌ లింకు ద్వారా తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డిని 9849913071 నంబర్‌లో సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, డీఈవో పి.రామారావు, డీఎస్‌వో కిరణ్‌కుమార్‌, ఈడీఎం నదీమ్‌, డీఎంహెచ్‌వో రాజేందర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement