నిర్మల్చైన్గేట్: భిక్షాటన నియంత్రణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని బాలల సంక్షేమ కమిటీ కార్యాలయాన్ని శనివారం సందర్శించారు. జిల్లాలో కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, బాల్య వివాహాల నియంత్రణ, అనాథ బాలల గుర్తింపు తదితర అంశాలపై సీడబ్ల్యూసీ సభ్యులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనవరి 1 నుంచి భిక్షాటన నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భిక్షాటన నిషేధ చట్టం కఠినంగా అమలు చేయాలని సూచించారు. పట్టణాలలోని ముఖ్య కూడళ్లలో భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి, పునరావాస కేంద్రాలను తరలించాలన్నారు. పునరావాస కేంద్రాలలో భిక్షగాళ్లకు ఆశ్రయం, ఆహారం, విద్య, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందించాలన్నారు. భిక్షాటన నియంత్రించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. భిక్షాటనను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి భిక్షాటన నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో బాల్యవివాహాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి మురళి, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment