విధుల్లో చేరిన నాన్ టీచింగ్ సిబ్బంది
నిర్మల్ రూరల్: విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిర్మల్ అర్బన్, జిల్లా కేంద్రంలోని యూఆర్‌ఎస్ అర్బన్ పాఠశాలల సమగ్ర శిక్ష నాన్ టీచింగ్ సిబ్బంది శనివారం సాయంత్రం విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా డీఈవో కార్యాలయంలో డీఈవో రామారావుకు జాయినింగ్ లెటర్ రాసి ఇచ్చారు. విద్యార్థులు తమవల్ల ఇబ్బందులకు గురికావొద్దని, వారి క్షేమం దష్ట్యా విధుల్లో చేరుతున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీఈవో వారిని అభినందించారు. మిగతా కేజీబీవీలలోని సిబ్బంది కూడా విధుల్లో చేరాలని కోరారు. ఇందులో జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ పద్మ, కేజీబీవీ జిల్లా ప్రత్యేక అధికారి సలోమి కరుణ, అధికారులు వెంకటరమణ, నరసయ్య, ప్రవీణ్ కుమార్, కృష్ణవేణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment