నిర్మల్
సెలవంటూ వెళ్లిపోయారు..!
సారంగపూర్ మండలం మలక్‌చించోలికి చెందిన పొద్దుటూరి నర్సారెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పని చేశారు. గత జనవరిలో తుదిశ్వాస విడిచారు. 8లోu
సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు
సోన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆదివా రం నిర్వహించిన జాతీయస్థాయి యోగా, కరా టే పోటీల్లో మండల కేంద్రంలోని అభ్యాస గు రుకుల విద్యార్థులు సత్తా చాటారు. యోగాలో రెండు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకాలు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రదీప్‌కుమార్ తెలిపారు. కరాటే పోటీల్లో ఆరు బంగారు, ఎనిమిది వెండి, రెండు కాంస్య పతకాలు సాధించినట్లు పేర్కొన్నా రు. ఈ సందర్భంగా విద్యార్థులను యోగా, కరాటే మాస్టర్లు చరణ్, చిరంజీవి, నర్సయ్యను హెచ్‌ఎం, సిబ్బంది అభినందించారు.
2024.. చూస్తుండగానే కాలగమనంలో చివరిదశకు చేరింది. ఈ ఏడాది ప్రారంభమవుతూనే జిల్లాకు కొత్త ఎస్పీని తీసుకొచ్చింది. కొన్నినెలల్లోనే కలెక్టర్‌నూ మార్చేసింది. జిల్లాలో ఎన్నో మార్పులు, చేర్పులు చేసుకుంటూ, యూబిట్ దందా తదితర ఘటనలతో రాష్ట్రస్థాయిలోనూ చర్చనీయాంశమైంది. ఎక్కడో తిప్పేశ్వర్ అడవుల నుంచి ‘జానీ’ అనే పులి ఆడతోడు కోసం వాకింగ్ చేస్తూ జిల్లా అంతా చుట్టేసి వెళ్లింది. ఇలా ఎన్నో సంఘటనల సమాహారాన్ని 2024 మిగులుస్తూ.. వెళ్లిపోయేందుకు సిద్ధమవుతోంది. పలు ముఖ్యమైన అంశాలపై ‘ఇయర్ రౌండప్’.. – నిర్మల్
● జిల్లాకు కొత్త ఎస్పీ, కలెక్టర్
● ‘కడెం’.. ఎత్తిపోతలకు నిధులు
● ప్రాణం తీసిన ఫుడ్‌పాయిజన్
● జిల్లాను చుట్టి వెళ్లిన ‘జానీ’
వరుసగా ఘటనలు ఇలా..
● ఎస్పీ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ బదిలీ కాగా, కొత్త ఎస్పీగా జీ జానకీషర్మిల వచ్చారు.
● అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. వాడవాడలా సీతారాముల కల్యాణాలు జరిపించారు. భోజనాలు ఏర్పాటు చేశారు.
● జిల్లా మీదుగా రైల్వేలైన్ తీసుకువస్తామని బాండ్‌పేపర్ రాసిచ్చినవాళ్లకే ఓటేస్తామని జిల్లాకేంద్రంలోని పెన్షనర్స్ భవన్‌లో వివిధ సంఘాల ప్రతినిధులు స్పష్టంచేశారు.
● మహిళా సమన్వయ వేదిక ఆధ్వర్యంలో నిర్మల్‌లోని రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ‘నారీశక్తి’ సమ్మేళనానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది మహిళలు హాజరయ్యారు.
● ఎన్నడూ లేనంతగా మార్చి 28వ తేదీన దస్తురాబాద్ మండలకేంద్రంలో అత్యధికంగా 43.1 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
● నర్సాపూర్(జీ) కేజీబీవీలో జరిగిన ఫుడ్‌పాయిజన్ ఘటనలో దాదాపు 63మంది విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిర్మల్ ఆస్పత్రిలో 39, నర్సాపూర్‌లో 23 మంది చికిత్స పొందారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఒకరిని నిజామాబాద్ తరలించారు.
● పార్లమెంట్ ఎన్నికలను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించారు. జిల్లాలో 71శాతం ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
● జిల్లాకేంద్రానికి చెందిన గైనకాలజిస్ట్ చంద్రిక మిసెస్ వరల్డ్ పోటీల్లో శాంతికిరీటాన్ని గెలుచుకున్నారు. గురుగావ్‌లో నిర్వహించిన పోటీల్లో ‘మిసెస్ వరల్డ్ పీస్’తో పాటు ‘మిసెస్ ఇంటలెక్చువల్’ సబ్‌టైటిల్ దక్కించుకున్నారు.
● మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మీదుగా సారంగపూర్ మండలంలో పెద్దపులి అడుగుపెట్టింది. ప్రజలను ఆందోళనకు గురి చేసింది.
● జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌రెడ్డి బదిలీ అయ్యారు. నూతన డీఈవోగా నిజామాబాద్ విద్యాశాఖ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న నాగజ్యోతి నియమితులయ్యారు. ఆమె కూడా బాధ్యతలు చేపట్టలేదు. చివరకు రామారావును డీఈవోగా నియమించారు.
● ఆత్మహత్యలు లేని ట్రిపుల్‌ఐటీగా మార్చేందుకు ఆర్జీయూకేటీని దత్తత తీసుకుంటున్నట్లు ఎస్పీ జానకీషర్మిల ప్రకటించారు.
● తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు, సిబ్బంది నిరవధిక సమ్మె ప్రారంభించారు. ప్రతిరోజూ తీరొక్క నిరసనలు చేపడుతున్నారు.
న్యూస్‌రీల్
జానీ అనే పేరుగల ఈ పెద్దపులి సారంగపూర్, కుంటాల, కుభీర్, దిలావర్‌పూర్, నిర్మల్‌రూరల్, మామడ, ఖానాపూర్, పెంబి, కడెం మండలాల్లో సంచరిస్తూ పలు పశువులను చంపేసింది.
నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించి నిలిచిపోయిన టీయూఎఫ్‌ఐడీసీ, ఎస్‌డీఎఫ్ నిధులు రూ.80కోట్లను విడుదల చేయాలని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కోరారు.
డీఆర్వో భుజంగరావు ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు.
జిల్లాకేంద్రంలోని గ్రిల్–నైన్ హోటల్‌లో ఫుడ్‌పాయిజన్ అయ్యింది. ఇక్కడ భోజనం చేసిన వారిలో చాలామంది అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఓ స్కూల్‌లో పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఫూల్‌కాలీబైగా అనే యువతి తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందడం సంచలనమైంది.
కలెక్టర్ ఆశీష్‌సంగ్వాన్ కామారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. జిల్లా నూతన కలెక్టర్‌గా జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ నియమితులయ్యారు.
కొత్త న్యాయ (భారత న్యాయసంహిత) చట్టాల అమలు ప్రారంభమైంది. లక్ష్మ ణచాంద మండలానికి చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందడంతో తొలి కేసు నమోదు చేశారు.
యూబిట్ కాయిన్‌దందాపై పోలీసుల చర్యలు ప్రారంభించారు. జిల్లాలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
వర్షాలు, వరదల నేపథ్యంలో మంత్రి శ్రీధర్‌బాబు జిల్లాలో పర్యటించారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డితో కలిసి జిల్లాకేంద్రంలోని జీఎన్‌ఆర్ ముంపుకాలనీని పరిశీలించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. అనంతరం మంత్రి బీజేఎల్పీనేత ఇంట్లో భోజనం చేయడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment