జిల్లా కేంద్రంలో రోడ్డు డివైడర్ మధ్య పెట్టిన కోనో కార్పస్ చెట్లు ప్రజారోగ్యంపై దుష్ప్రభా వం చూపుతున్నాయి. దీంతో వీటిని తీసేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఆశ–నిరాశ..
9లోu
● రెండేళ్లుగా భారీ వరదలతో దెబ్బతిన్న కడెం ప్రాజెక్టు మరమ్మతులకు ఈఏడాది రూ.9.26 కోట్లు వచ్చాయి. తాజాగా పూడికతీత కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు ప్రాజెక్టుల్లో జిల్లా నుంచి కడెం కూడా ఉండటం విశేషం.
● గతేడాది వర్షాలతో కొట్టుకుపోయిన సిరాల ప్రాజెక్టు మరమ్మతుల కోసం రూ.10కోట్లు మంజూరయ్యాయి.
● పిప్రి ఎత్తిపోతల పథకానికి రూ.10కోట్లు, కనకాపూర్ ఎత్తిపోతల మరమ్మతుకు రూ.కోటి 40లక్షలు ఇచ్చారు. నిర్మల్ పట్టణానికి అమృత్ పథకం కింద రూ.63కోట్లు మంజూరయ్యాయి.
● గతేడాది ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని 27ప్యాకేజీ నీటి ఎత్తిపోతలు ఆ ఒక్కరోజుకే పరిమితం కావడం శోచనీయం. 28వ ప్యాకేజీ కనీసం అడుగు కూడా ముందుకు పడలేదు.
● జిల్లాలో గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఒకేరోజు 5,940 ఇంకుడుగుంతలను నిర్మించి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు.
● సీ్త్రనిధి ద్వారా రుణాలు ఇవ్వడం, రికవరీ చేయడంలో వరుసగా మూడోసారి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో నిలిచి అవార్డు అందుకుంది.
● సమీకృత సాగు విధానాన్ని విజయవంతంగా అమలు చేసి చూపినందున పెప్సికో సంస్థ నుంచి జాతీయస్థాయిలో డీఆర్డీవో విజయలక్ష్మి, మహిళా సమాఖ్య కేంద్రమంత్రుల చేతుల మీదుగా ప్రథమ పురస్కారాన్ని అందుకున్నారు.
● ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంతో ఇటిక్యాల ఫీల్డ్ అసిస్టెంట్ వినాయక్, వెంకంపోచంపాడ్ ఉపాధి కూలీ చవాన్ మహేశ్ ఢిల్లీలో కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ నిర్వహించిన మేధోమథన సదస్సులో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment