కనులపండువగా కూడారై మహోత్సవం
భైంసాటౌన్: పట్టణంలోని పద్మావతి కాలనీలోగల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడారై మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఉదయమే భక్తులు అధికసంఖ్యలో రాగా, అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనాది కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం, తిరుప్పావై పారాయణం, లక్ష్మీవేంకటేశ్వర అష్టోత్తర శతనామార్చన, నివేదన, హారతి, మంగళ శాసనం కార్యక్రమాలు జరిపారు. అనంతరం అమ్మవార్ల సమేత స్వామివారి విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో స్థానిక ధనంజయ్ ఫ్యాక్టరీ వరకు పాటలు, నృత్యాల మధ్య తీసుకెళ్లారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు వనభోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే పురాణాబజార్‌లో మార్వాడి సంఘం ఆధ్వర్యంలోనూ ధర్మశాలలో కూడారై ఉత్సవం ఘనంగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment