హరితహారం చెట్ల నరికివేత..!
భైంసాటౌన్: పట్టణంలోని బస్టాండ్ ప్రధాన రహదారి వెంబడి మున్సిపల్ ఆధ్వర్యంలో పెంచిన హరితహారం చెట్లు ఆదివారం నరికివేతకు గురయ్యాయి. స్థానిక ఐబీ ప్రాంతం, దర్శన్ లాడ్జి ఎదుట రోడ్డు వెంబడి కొన్నిచెట్లు నరికివేశారు. కొన్నింటికి కొమ్మలు తొలగించగా, మరికొన్నింటిని మొదళ్ల వరకు నరికేశారు. ఈ విషయమై మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ అనీస్‌ను వివరణ కోరగా, చెట్లు నరికివేసిన మాట వాస్తవమేనని తెలిపారు. కానీ, ఎవరు చేశారో తెలియదని పేర్కొన్నారు. విషయం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment