అడెల్లిలో భక్తుల సందడి
సారంగపూర్: అడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటికిటలాడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు నిజామాబాద్, వ రంగల్, కరీంనగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర నుంచి అధికసంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో రమేశ్, ఎస్సై భక్తులకు తగి న ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం సీసీఎఫ్ ప్రభా కర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆయన వెంట ఎఫ్‌ఆ ర్వో రామకృష్ణారావు, అనిత, నజీర్‌ఖాన్, స్వ ప్న, వెన్నెల తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment