నిర్మల్
మంగళవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
సివిల్ సప్లయ్ హమాలీల సమ్మె నోటీసు
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ జిల్లా సివిల్ సప్లయ్ హమాలీలు జిల్లా మేనేజర్ సురేశ్‌కు సోమవారం సమ్మె నోటీసు అందించారు. పెరిగిన రేట్లకు అనుగుణంగా జీవో విడుదల చేయాలని లేని పక్షంలో జనవరి 1 నుంచి సమ్మె చేస్తామని పేర్కొన్నారు. నోటీసు ఇచ్చినవారిలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్, జిల్లా సివిల్ సప్లయ్ హమాలీ యూనియన్ ప్రధానకార్యదర్శి రాథోడ్ పుండలీక్, జిల్లా ఉపాధ్యక్షడు పిట్టల భీమేష్, ఘంచక్కర్ శివాజీ, భీమ్‌రావు ఉన్నారు.
నిర్మల్: 2024.. జిల్లా పోలీసుడైరీలో గుర్తుండిపోయే ఏడాది. ఎందుకంటే.. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, కిడ్నాపులు పెరిగాయి. చైన్‌స్నాచింగ్‌లు కామన్ అయ్యాయి. ఇవి జరిగిన తర్వాత చేసే విచారణ సాధారణమే అయింది. ఆందోళనలు, నిరసనలు, ఉత్సవాల సమయంలోనే పోలీసుల పనితనం ప్రజలు నేరుగా గమనిస్తారు. ఈఏడాది గణేశ్ ఉత్సవాలు సాఫీగా ముగించడం, ఇథనాల్ ఫ్యాక్టరీపై పోరాటంలో శాంతిమంత్రం పఠించడం జిల్లా పోలీసులకు రాష్ట్రస్థాయిలో పేరు తెచ్చాయి. రాష్ట్రంలోనే సంచలనంగా మారిన ‘యూబిట్’ కాయిన్‌దందాను వెలికితీసి, ఎనిమిదిమందిని అరెస్టు చేశారు. బాసర ట్రిపుల్‌ఐటీని దత్తత తీసుకోవడం విశేషం. సోమవారం ఎస్పీ వెల్లడించిన వార్షిన నేర నివేదిక ప్రకారం గడిచిన రెండేళ్లతో పోలిస్తే.. ఈ ఏడాది నేరాల సంఖ్య పెరగడం గమనార్హం.
● 176 దొంగతనాలు, 34 కిడ్నాప్‌లు ● ఈ ఏడాది పెరిగిన క్రైం రేటు
● సవాల్‌గా తీసుకున్న పోలీసులు ● ‘యూబిట్’ దందా గుట్టువిప్పి..
● ‘ఇథనాల్’ మంటను చల్లార్చి.. ● ఇదీ.. 2024 జిల్లా పోలీస్ డైరీ
పెరిగిన కేసులు..
జిల్లాలో గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య పెరిగింది. 2022లో మొత్తం 3,120 కేసులు నమోదుకాగా, గత ఏడాది 2,967 కేసులయ్యాయి. ఈ ఏడాది 3,524 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 20 పోలీసుస్టేషన్‌లు ఉండగా, అందులో నిర్మల్‌టౌన్ స్టేషన్‌లో అత్యధికంగా 599 కేసులు నమోదుకాగా, అత్యల్పంగా పెంబి స్టేషన్‌లో 75 కేసులు నమోదయ్యాయి.
హత్యలు.. అత్యాచారాలు..
జిల్లాలో నేరప్రవృత్తి పెరిగిందనే చెప్పొచ్చు. రెండేళ్ల క్రితం జిల్లాలో 13 హత్యలు కాగా, గతేడాది ఏడు మర్డర్లు జరిగాయి. ఇక ఈ ఏడాది 16 హత్యలు జరిగాయి. అత్యాచారాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2022లో 17కాగా, 2023లో 16 అయ్యాయి. ఈ ఏడాది ఏకంగా 39 లైంగికదాడులు నమోదు కావడం ఆందోళనకరం. ఈఏడాది దొంగతనాలూ కొనసాగాయి. రాత్రిపూట 142 చోరీలు కాగా, పగటిపూట దోపిడీకేసులు 24 నమోదయ్యాయి. ఇక సాధారణ దొంగతనం కేసులు 289, దోపిడీ తరహాలో 10 నమోదయ్యాయి. మొత్తం రూ.2,19,09,577 సొత్తు చోరీకాగా, రూ.63,70,398 సొత్తు రికవరీ చేశారు.
ప్రాణాలు తీసిన ప్రమాదాలు..
రోడ్డు ప్రమాదాలూ ఈ ఏడాదిలో గణనీయంగా పెరిగాయి. 2022లో 260, 2023లో 214 రోడ్డుప్రమాదాలు చోటుచేసుకోగా, ఈ ఏడాదిలో ఏకంగా 390 యాక్సిడెంట్లు అయ్యాయి. ఇందులో 133 మంది చనిపోగా, 412 మంది క్షతగాత్రులయ్యారు.
సైబర్ క్రైమ్...
జిల్లాలో 2024లో 49 సైబర్‌క్రైమ్ కేసులు నమోదయ్యాయి. వివిధ రకాల మాయమాటలతో ఈ కేసు ల న్నింటినీ కలిపి ఏకంగా రూ.6,35,33,916 కొట్టేశారు. ఇందులో కేసులు నమోదైన తర్వాత పోలీసుశాఖ బ్యాంకర్ల సహకారంతో రూ.69,40,61,000 ఫ్రిజ్ చేయించారు. బాధితులకు రూ.13,14,737 తిరిగి ఇప్పించారు. మరో రూ.56,25,324 కోర్టు ఆదేశాలు రాగానే అందించనున్నారు.
పేరుతెచ్చిన యూబిట్..
ఈ ఏడాది జిల్లా పోలీసుశాఖ పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగింది. ఇందులో ప్రధానంగా యూబిట్ క్రిప్టోకరెన్సీ కేసు ప్రధానమైంది. జిల్లాలో వేళ్లానుకుపోయిన కాయిన్‌దందాను ఎస్పీ జానకీషర్మిల సారథ్యంలో వెలికితీశారు. వందలాదిమంది బాధితులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చేశారు. స్టార్లుగా ఉన్న సార్లు, ఎకై ్సజ్ ఎస్సై, ఇతర ఉద్యోగులు, చివరకు తమ శాఖకు చెందిన కానిస్టేబుల్‌నూ అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ దెబ్బకు వేరే జిల్లాలోనూ ఈ దందా ఆగిపోయింది.
న్యూస్‌రీల్
ప్రాణాలు కాపాడిన డయల్ 100..
జూలై 21న తెల్లవారుజామున 2.15 గంటలకు సారంగపూర్ మండలం మహబూబ్‌ఘాట్‌పై కారు లోయలో పడినట్లు డయల్ 100కు సమాచారం అందింది. ఆ రాత్రి డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ గోపీనాథ్, ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుల్ లింగారామ్, హోంగార్డు నవీన్ స్పందించి ఘటనాస్థలికి చేరుకున్నారు. లోయలో పడిపోయిన ముగ్గురిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. ఇలా.. జిల్లాలో ఈ ఏడాది డయల్ 100 పదుల సంఖ్యలో ప్రాణాలు కాపాడింది. తప్పిపోయిన వారిని గంటలవ్యవధిలోనే వెది కిపెట్టింది. ఈ ఏడాది ఏకంగా 19,290 డయ ల్ 100 కాల్స్ అటెండ్ చేశారు. సీఈఐఆర్ ద్వారా పోగొట్టుకున్న, చోరీకి గురైన 1,081 సెల్‌ఫోన్లను బాధితులకు అందించారు.
2024లో నమోదైన కేసుల వివరాలు..
ఎస్సీ, ఎస్టీ కేసులు 40
డ్రంక్‌అండ్ డ్రైవ్ 3,606
హిస్టరీషీట్లు 29
రౌడీషీట్ 16
సస్పెక్ట్‌షీట్ 11
ఫింగర్‌ప్రింట్స్ 134
హ్యుమన్‌ట్రాఫికింగ్ 11
ఆపరేషన్‌స్మైల్ 136
లోక్‌అదాలత్‌లో పరిష్కారం 8,724
ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు 507
భరోసా సెంటర్ 52
ఈవ్‌టీజింగ్ 46
‘ఇథనాల్’ పోరులో భేష్..
దిలావర్‌పూర్ మండలాన్ని కుదిపేసిన ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటంలో పోలీసుల పాత్ర చాలాచోట్ల భేష్ అనిపించుకుంది. లాఠీచార్జీ చేయాల్సిన చోట ఎస్పీ తీసుకున్న శాంతియుత నిర్ణయం, సర్కారుతో మాట్లాడేందుకు తీసుకున్న చొరవ ఆ గ్రామాల మనసు గెలుచుకునేలా చేసింది. రాళ్లు విసిరిన చోటే చివరకు ఆ గ్రామాలు ‘ఎస్పీ జిందాబాద్’ అంటూ నినాదాలు చేయడం పోలీసుశాఖకు బూస్టులా పనిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment