వణికించిన పులి, ఏనుగు | - | Sakshi
Sakshi News home page

వణికించిన పులి, ఏనుగు

Published Tue, Dec 31 2024 12:06 AM | Last Updated on Tue, Dec 31 2024 12:06 AM

వణికి

వణికించిన పులి, ఏనుగు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ ఏడాది వన్యప్రాణులు అలజడి రేపాయి. ఏటా చలికాలంలో పులుల సంచారం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మరింత ఎక్కువగా కనిపించాయి. రెండేళ్ల తర్వాత గత నెలలో కాగజ్‌నగర్‌ మండలం గన్నారానికి చెందిన మోర్లే లక్ష్మిని పత్తి చేనులోనే దాడి చేసి చంపేయగా, సిర్పూర్‌(టి) పరిధి దుబ్బగూడలో రైతు సురేశ్‌పై దాడి చేసింది. అయితే ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఇక రైతుల పశువులు, మేకల మందలపైనా దాడులు చేస్తున్నాయి. దీంతో అటవీ సమీప ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు కునుకు లేకుండా పోతోంది. రోడ్లు దాటుతూ, జన సంచారం ఉన్న చోటు వరకు పులులు, చిరుతలు కనిపిస్తున్నాయి. గడిచిన ఏడాదిలోనూ మనుషులు, వన్యప్రాణులకు ఘర్షణ కొనసాగింది.

వలస పులులతో భయం

ఈ ఏడాది పొడవునా మహారాష్ట్ర నుంచి కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులోకి పులులు రాకపోకలు సాగించాయి. ఇందులో ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల వరకు ఓ మగపులి, సిర్పూర్‌(టి) మీదుగా మరో పులి, ఆసిఫాబాద్‌ జిల్లాలో మరో పులి సంచరించింది. వీటిలో రెండు మగవి, కాగా ఒకటి ఆడపులి ఉంది. ప్రస్తుతం రెండు వలస పులులు సంచరిస్తున్నాయి. మరోవైపు ఇద్దరిపై దాడి చేసి పులి మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో సంచరిస్తోంది. ఆదిలాబాద్‌ నుంచి మొదలై జన్నారం వరకు పులులు సంచరించాయి. దీంతో ఆయా చోట్ల ఉన్న స్థానికులు బెంబేలెత్తారు.

రెండు పులుల మరణం

మరోవైపు ఈ ఏడాదిలోనే రెండు పులులు మరణించాయి. ఐదారేళ్ల వయస్సున్న మగపులి(ఎస్‌ 9)ని విషమిచ్చి చంపారు. గత జనవరిలో కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ డివిజన్‌ దరిగాం, సర్కెపల్లి మధ్య బూడిద మామిడి అడవుల్లో ఏడాదిన్నర ఆడపులి, అదే నెల 8న ఐదారేళ్ల మగ పులి కళేబరాలను గుర్తించారు. ఈ రెండింటిలో ఆడపులి మాత్రం మరోపులితో పోరులో చనిపోగా, మగపులి మాత్రం విషంతో చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు పులలు మరణంతో అటు అటవీ అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు పలువురు రైతులపైనా కేసులు నమోదయ్యాయి. అంతేకాక మరోసారి ఎవరూ పులులకు ముప్పు కలిగించకుండా, పశువులు, మనుషులపై దాడి చేస్తే నష్టపరిహారం పెంచడంతోపాటు 24గంటల్లోనే చెల్లించేలా ఏర్పాటు చేశారు.

తొలిసారిగా ఏనుగు దాడిలో ఇద్దరి మృతి

పులి దాడిలో మరొకరు..

రెండు పులులు కూడా మరణం

ఈ ఏడాదిలోనూ వన్యప్రాణులు, మనుషులకు ఘర్షణ

తొలిసారిగా ఏనుగు రాక

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఓ ఏనుగు ఉమ్మడి జిల్లాకు వచ్చింది. మూడు రోజులపాటు సంచరిస్తూ అలజడి రేపింది. ఇద్దరిపై దాడి చేసి చంపేసింది. గత ఏప్రిల్‌లో 25నుంచి 30ఏళ్ల వయస్సున్న మగ ఏనుగు చింతలమానేపల్లిలో మండలం బూరెపల్లిలో మిరపతోటలో రైతు శంకర్‌ను చంపేసింది. మరుసటి రోజే పెంచికల్‌పేట మండలం కొండపల్లి, కారు పోశన్నపై దాడి చేసి చంపేసింది. దీంతో స్థానికులు చేలల్లోకి వెళ్లాలంటే ఆందోళన చెందారు. చివరకు మరళిగూడ సమీపంలో ప్రాణహిత దాటి మహారాష్ట్ర వైపు వెళ్లిపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు భవిష్యత్తులోనూ ఏనుగులు వచ్చే అవకాశం ఉన్నట్లు ముందస్తుగా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికను సైతం అటవీ శాఖ సిద్ధం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
వణికించిన పులి, ఏనుగు1
1/3

వణికించిన పులి, ఏనుగు

వణికించిన పులి, ఏనుగు2
2/3

వణికించిన పులి, ఏనుగు

వణికించిన పులి, ఏనుగు3
3/3

వణికించిన పులి, ఏనుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement