మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
నిర్మల్‌చైన్‌గేట్: సమస్యలు పరిష్కరించాలని సీఐటీ యూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించా రు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్ ఆ ధ్వర్యంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సురేశ్ మా ట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల 6 నెలల పెండింగ్ వేతనాలు, 5 నెలల పెండింగ్ బిల్లు విడుదల చేయాలన్నారు. జిల్లాలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులను గుర్తించి మెనూ చార్జీలు ఒక్కొ క్క విద్యార్థికి కనీసం రూ.20 ఇవ్వాలని, కోడిగుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలన్నారు. వయసు పైబడి రిటైర్ అవుతున్న కార్మికులందరికీ రూ.3 ల క్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని సూచించారు. ఎ న్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం రూ.10 వేల వేతనం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మఽ ద్యాహ్న భోజన యూనియన్ జిల్లా అధ్యక్షుడు భారత్‌బాయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాధ, ఉపాధ్యక్షులు లక్ష్మి, గంగాధర్, సహాయ కార్యదర్శి విజయ, శంకరమ్మ, సతవ్వ, ఎస్‌కే.భాను, రాజమణి, మంగ, మండల సహాయ కార్యదర్శులు పద్మ, లింగవ్వ, మంజుల, దాంబాయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment