ప్రత్యేక పాలనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదు. అయితే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు ప్రభుత్వం ఇప్పటికే స్పెషలాఫీసర్లను ని యమించిన సంగతి తెలిసిందే. సహకార సంఘాలకూ అదే మాదిరిగా ప్రత్యేధికారుల పాలనకే మొగ్గు చూపే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల సహకార శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎంపీడీవో, తహసీల్దార్ స్థాయి అధికారులను సొసైటీలకు ప్రత్యేకాధికారులుగా నియమించవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సొసైటీకి ఒక్కో ప్రత్యేకాధికారిని నియమిస్తారా? లేక రెండు, మూడు సొసైటీలను కలిపి ఒకరిని నియమిస్తారా? అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment