![‘రైతులకు ఇబ్బంది రానివ్వలే’](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09nrl81-340029_mr-1739130941-0.jpg.webp?itok=r7x7upZr)
‘రైతులకు ఇబ్బంది రానివ్వలే’
లక్ష్మణచాంద: మండల రైతులకు ఎలాంటి ఇ బ్బంది లేకుండా చూశామని డీసీసీబీ వైస్ చైర్మ న్ రఘునందన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పీఏసీఎస్‌లో రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాల వడ్డీపై 6శాతం రాయితీ ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. పీఏసీఎస్ ద్వారా రైతులకు సకా లంలో విత్తనాలు, ఎరువులు, టార్పాలిన్లు అందజేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని తెలిపారు. పీఏసీఎస్ వైస్ చైర్మన్ వెంకట రాజు, నిర్మల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీని వాస్, డైరెక్టర్లు ముత్యంరెడ్డి, శేఖర్‌రెడ్డి, రాజేశ్వర్, ముత్తవ్వ, కిషన్, నరేశ్, చిన్న రాజారెడ్డి, తా జా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రాజేశ్వర్, నాయ కులు రాజేశ్వర్, చిన్నయ్య, నరేశ్‌రెడ్డి, రమేశ్, నారాగౌడ్, భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment