భైంసాటౌన్: జిల్లాలో పీడీఎస్ బియ్యం దందాకు అడ్డుకట్ట పడటం లేదు. ప్రభుత్వం రేషన్ దుకాణా ల ద్వారా పేదలకు ఉచితంగా అందిస్తున్న దొడ్డుబియ్యం దళారుల ద్వారా తిరిగి లబ్ధిదారులకే చేరుతోంది. ప్రభుత్వం అందిస్తున్న బియ్యం పలుసార్లు రీసైక్లింగ్ అవుతుండటంతో అవి నాసిరకంగా ఉంటున్నాయి. దీంతో చాలామంది వాటిని తినలేక వి క్రయిస్తున్నారు. దళారులు వారి నుంచి తక్కువ ధర కు సేకరించి బడా వ్యాపారులకు అమ్ముతున్నారు. వారు ఇలా సేకరించిన బియ్యాన్ని తిరిగి రైస్‌మిల్లులకు సరఫరా చేస్తున్నారు. ఫలితంగా లబ్ధిదారులు విక్రయించిన బియ్యం దళారుల ద్వారా రైస్‌మిల్లులకు, అక్కడి నుంచి పౌర సరఫరాల శాఖకు, అక్కడి నుంచి రేషన్ డీలర్లకు, తిరిగి లబ్ధిదారులకు చేరుతోంది. ఇలా రేషన్‌బియ్యం రీసైక్లింగ్ అవుతూనే ఉంది. ఇదంతా సంబంధిత శాఖ అధికారులకు తెలిసే జరుగుతోందనే ఆరోపణలున్నాయి.
జిల్లా నుంచి మహారాష్ట్రకు..
మహారాష్ట్ర జిల్లాకు సరిహద్దున ఉండటంతో రేషన్‌బియ్యం రీసైక్లింగ్ దందా జోరుగా సాగుతోంది. ప్ర భుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా అందజేస్తోంది. ఇవి దొడ్డు బియ్యం కావడం, రేషన్‌కార్డులున్నవారిలో చాలామంది ధనికులు ఉండటంతో వారు విక్రయిస్తున్నారు. చిరువ్యాపారులు కొందరు గ్రామాలు, వీధుల్లో తిరుగుతూ లబ్ధిదారుల నుంచి రూ.12 నుంచి రూ.15వరకు కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని కొందరు మండల, పట్టణ కేంద్రాల్లోని వ్యాపారులకు రూ.18 వరకు విక్రయిస్తున్నారు. వారు మహారాష్ట్రకు తరలిస్తూ అక్కడి వ్యాపారులకు అమ్ముతున్నారు. భైంసా పట్టణంతోపాటు ముధోల్ నియోజకవర్గంలోని సరిహద్దు ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం ధర్మాబాద్‌లోని ఓ వ్యాపారికి చేరుతోంది. సదరు వ్యాపారి పెద్దమొత్తంలో సేకరించిన బియ్యాన్ని తిరిగి జిల్లాలోని పలు రైస్‌మిల్లులతోపాటు అక్కడి రహస్య ప్రాంతాల్లో సన్నబియ్యంగా మార్చి సంచుల్లో ప్యాక్ చేసి తిరిగి జిల్లాలోకి పంపిస్తున్నారు.
రేషన్‌షాపుల్లోనూ దందా..
డీలర్ల వద్ద పలువురు లబ్ధిదారులు బియ్యం తీసుకుని చిరువ్యాపారులకు విక్రయిస్తున్నారు. చాలా మంది లబ్ధిదారులు డీలర్లకే బియ్యం విక్రయిస్తున్నా రు. ప్రతినెలా రేషన్ దుకాణాల్లో వేలిముద్ర వేసి బి య్యం తీసుకోకుండా డీలర్లకే విక్రయిస్తున్నారు. ఇ లా సేకరించిన బియ్యాన్ని డీలర్లు కమీషన్ తీసుకు ని వ్యాపారులకు అమ్ముతున్నారు. రేషన్‌షాపులపై సంబంధిత అఽధికారుల పర్యవేక్షణ లేక దందాకు అ డ్డూఅదుపు లేకుండా పోయింది. దీంతో రేషన్ షా పుల్లోనే బియ్యం రీసైక్లింగ్ దందా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment