కడెం మండలం దిల్దార్‌నగర్, ఎలగడప, సారంగపూర్ గ్రామాలకు సమీపంలో.. గోదావరి నది తీరాన కొండపై కొలువుదీరిన శ్రీఅక్కకొండ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం కనుల పండువగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వొద్దిపర్తి వంశీకృష్ణామాచార్యుల ఆధ్వర్యంలో దేవతమూర్తుల పల్లకీసేవ, లక్ష్మీసమేత స్వామి వారి కల్యాణం వైభవోపేతంగా జరిగింది. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. స్వామివారిని దర్శించుకున్న ఖానాపూర్ కోర్టు మెజిస్ట్రేట్ జితిన్‌కుమార్, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు పైడిపల్లి రవీందర్‌రావు, కాంగ్రెస్ నాయకుడు శ్యాంనాయక్‌ను ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈనెల 8 ప్రారంభమైన అక్కకొండ బ్రహ్మోత్సవాలు 14వ తేదీ వరకు కొనసాగనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొప్పుల లక్ష్మణ్ ఈ సందర్భంగా తెలిపారు. – కడెం
Comments
Please login to add a commentAdd a comment